'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్‌ఫండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.
తమ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని 'మార్గదర్శి' చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది.
సీఐడీ సోదాలను అడ్డుకునేలా తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
సోదాలను నిలిపివేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేయాలని మార్గదర్శి తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకుండానే బెంచ్ ముందు ప్రస్తావించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది గోవిందారెడ్డి వాదించారు. ఇలాంటివి చర్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరిన సీఐడీ
హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది.
కంపెనీలో నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆరోపణలపై జరుగుతున్న విచారణలో భాగంగా కార్యాలయాల్లోని బ్యాలెన్స్ షీట్లు, ఇతర పత్రాలను పరిశీలించేందుకు అధికారుల బృందం వచ్చింది.
మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంపై విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరింది.
రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారుల సొమ్మును పణంగా పెట్టి ఆర్బీఐ, చిట్ ఫండ్ చట్టంలోని పలు నిబంధనలను కంపెనీ ఉల్లంఘించిందని ఏపీ సీఐడీ ఆరోపించింది.