LOADING...
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదు: చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదు: చంద్రబాబు

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2.2 శాతం మేర వృద్ధి నమోదు: చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆదాయంలో 2.2 శాతం పెరిగినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆదాయ విభాగాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సొంత ఆదాయ వనరులు విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పన్నుల ఎగవేతలను నివారించేందుకు కృత్రిమ మేథస్సు (AI) సాంకేతికతను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి గల వార్షిక ఆదాయ లక్ష్యం రూ.1.37 లక్షల కోట్లను చేరుకోవడంపై అధికారులు సమగ్ర దృష్టి సారించాలని సీఎం సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష