Page Loader
ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు
ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర్నంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు

ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 13, 2023
07:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఇకపై 4 వారాలకు మించి ఎక్కడా పోస్టులు ఖాళీలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఖాళీలు పూరించాలన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా, నిరంతరం భర్తీ చేస్తూనే ఉండాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతికి చోటు ఉండకూడదని స్పష్టం చేశారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు టెలిఫోన్‌ నంబర్‌ ప్రతి చోటా పెట్టాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్ కీలకంగా పనిచేయాలన్నారు. అలాగే విలేజ్ క్లినిక్ స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

DETAILS

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి : సీఎం జగన్

ఇప్పటికే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు ఫస్ట్‌ఎయిడ్, స్నేక్‌ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్‌ కేర్, డ్రస్సింగ్, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లాంటి అంశాల్లో తర్ఫీదు అందించామని ఉన్నతాధికారులు చెప్పారు. సికిల్‌ సెల్‌ ఎనీమియాపై సీఎం సమీక్షించారు. ఈసారి దాదాపుగా 6.68 లక్షల మందికి రక్తహీనత పరీక్షలు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దంతసమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన అధికారులు, టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.