
టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్ రెడ్డి నియమాకం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుత బోర్డు పదవీకాలం ఆగస్ట్ 8తో పూర్తి కానుంది.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనూ టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో బోర్డు ఛైర్మన్‌గా పదవిలో కొనసాగారు.
సీఎం జగన్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా భూమన గుర్తింపు పొందారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటానని కోరినట్లు సమాచారం.తిరుపతిలో తనకు బదులుగా కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని భూమన కోరుకుంటున్నారు.
DETAILS
ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వైవీ సుబ్బారెడ్డి
ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే వెంకటేశ్వర స్వామి సన్నిధిని నడిపించే బోర్డుకు చైర్మన్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే ఛైర్మన్ పదవి తుది రేసులో ముగ్గురు బరిలోకి దిగారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి పోటీలో నిలిచారు. వీరిలో సీఎం జగన్ భూమనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ ఆశించి భంగపడ్డ వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. తర్వాత పదవి కాలం పొడిగించడంతో 4 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు.
వైవీ పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలపై దృష్టిపెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ రెఢీ చేస్తోంది.