LOADING...
Infosys : ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ సర్కార్..7 వేల మందికి ఉపాధి
ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ సర్కార్..7 వేల మందికి ఉపాధి

Infosys : ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ సర్కార్..7 వేల మందికి ఉపాధి

వ్రాసిన వారు Moogati Shabari
Apr 27, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో ముందంజలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు విశాఖపట్నంలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్ అక్కడ తన కొత్త క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది.

వివరాలు

విశాఖ వైపు మరికొన్ని కంపెనీలు..

ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో తొలి దశలోనే సుమారు 7 వేల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ, ఐటీఈఎస్ (ITeS) రంగాలకు సంబంధించిన ఈ కేంద్రం ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, బిజినెస్ ప్రాసెస్ సేవల్లో విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి హబ్‌గా ఎదగనుంది. ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ రాకతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడమే కాకుండా, మరిన్ని అనుబంధ సంస్థలు కూడా విశాఖ వైపు ఆకర్షితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement