NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
    రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

    Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 10, 2024
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు సంబంధించి రూ.11,467 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

    గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అధికారుల నివాస అపార్ట్‌మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణానికి నిధులు విడుదల చేయడంపై ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    న్యాయమూర్తులు,మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం బంగ్లాల నిర్మాణానికి నిధులు కేటాయించింది.

    సచివాలయ టవర్లు,అసెంబ్లీ వంటి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు,అలాగే రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ నిధులను ఉపయోగించనుంది.

    వివరాలు 

    నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సీఆర్డీఏ రూ. 1585 కోట్లు

    ఇంకా, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కింద 12 టవర్లతో 1200 అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రూ. 984 కోట్లు కేటాయించబడింది.

    కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయడం, శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సీఆర్డీఏ రూ. 1585 కోట్లు వెచ్చించనుంది.

    అలాగే, రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా నెట్‌వర్క్, సీవరేజీ, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు కోసం నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అమరావతి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Encumbrance Certificate Download : ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం భారతదేశం
    Group-1: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో కీలక విచారణ.. తీర్పు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు సుప్రీంకోర్టు
    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే! తెలంగాణ
    Polavaram: పోలవరం నిర్మాణంలో నిపుణుల హెచ్చరికలు.. సమగ్ర ప్రణాళికలు అవసరం పోలవరం

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025