తదుపరి వార్తా కథనం

Andhra Pradesh: ఏపీ 'RERA' చైర్మన్‌గా శివారెడ్డి నియామకం
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 15, 2025
09:47 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA) చైర్మన్, నలుగురు సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెరా చైర్మన్‌గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్‌గా గతంలో పనిచేసిన ఏ. శివారెడ్డి (A. Shiva Reddy)ని నియమించడం జరిగింది. దీనిని అధికారికంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ (S. Suresh Kumar) ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు. అలాగే, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మిగిలిన ముగ్గురు సభ్యుల నియామకాలను కూడా త్వరలోనే నిర్వహించనున్నారు.