
Chandrababu: ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్.. కుటుంబ అవసరాలపై ఫీల్డ్ సర్వే
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా 'ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్' ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు ఆధార్ కార్డ్ విధంగా ఉండనుంది. ప్రభుత్వ పథకాలు,లబ్ధిదారుల వివరాలు మొత్తం ఇందులో పొందుపరచబడతాయి. గురువారం సచివాలయంలో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాల్సిందని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
స్కీంలను రీ-డిజైన్ చేసే అంశాన్నీ పరిశీలిద్దాం: చంద్రబాబు
"ప్రతి కుటుంబానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఉపయోగించాలి. అవసరమైతే, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా, వేగంగా అవసరమైన వారికి చేరే విధంగా వ్యవస్థను రూపొందించాలి. ఫ్యామిలీ కార్డు ఆధార్ తరహాలో ఉండి, అందులోని వివరాలను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉండాలి" అని సమావేశంలో సీఎం అన్నారు. ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి.ప్రభుత్వ పథకాల వల్ల కుటుంబాలు విడిపోవడం వంటి పరిస్థితులు రాకూడదు.అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే స్కీంలను రీ-డిజైన్ చేసే అంశాన్నీ పరిశీలిద్దాం' అని సమీక్ష అధికారులతో సీఎం చంద్రబాబు అన్నారు.