చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాక్.. మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు మూడు కేసులకుే సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే విచారించిన ఉన్నత న్యాయస్థానం మూడు కేసుల్లోనూ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో ఏ కేసులోనూ టీడీపీ అధినేతకు బెయిల్ దక్కలేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా 3 బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇన్నర్ రింగు రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబును, పోలీసులు A1గా పేర్కొన్నారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో ఆయన A25గా ఉన్నారు.
ఇవాళ మధ్యాహ్నం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణ
మరోవైపు పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశంలపై సందిగ్ధత నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకోపక్క సుప్రీంకోర్టు ద్వారా ఉపశమనం దొరికితే పోలీస్ కస్టడీ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్ పై ఇవాళ మధ్యాహ్నం సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసం విచారించనుంది. అక్టోబర్ 3న ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలను సమర్పించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం పత్రాలను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆయా పత్రాలను పరిశీలించి విచారణ చేపట్టనుండటం గమనార్హం.