Page Loader
YS Jagan UK Tour: మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్‌.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్
మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్‌.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్

YS Jagan UK Tour: మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్‌.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయనకు తాజా పాస్‌పోర్ట్‌ పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఐదేళ్ల కాలవ్యవధి గల పాస్‌పోర్ట్‌ను వైఎస్‌ జగన్‌కు జారీ చేయాలని సంబంధిత పాస్‌పోర్ట్‌ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

వివరాలు 

పాస్ పోర్టు కోసం అవసరమైన ఎన్వోసీ జారీ చేస్తూ హైకోర్టు తీర్పు.. 

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 16వ తేదీన యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ చేసిన అభ్యర్థనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. అంతేకాక, ఎన్‌వోసీ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిర్దేశించిన విధంగా స్వయంగా కోర్టు ముందు హాజరవుతూ రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు.