LOADING...
AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు 
AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు

AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు 

వ్రాసిన వారు Stalin
Nov 29, 2023
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌పై జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య అభ్యంతరం చేశారు. ఏపీ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం రాజకీయపరమైనదని, కానీ దీన్ని ప్రభుత్వం కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు వెంకయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఏపీ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో సజ్జలతో పాటు ఏపీ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసును 4వారాలకు వాయిదా వేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

4వారాలకు విచారణ వాయిదా