Page Loader
ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా 
ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ

ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 05, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తి వివరాలు అందించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది. మరోవైపు ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకూడదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖలు రాస్తున్నారు. ఆర్‌-5 జోన్‌ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని లేఖలో పేర్కొన్నారు.

DETAILS

మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి రైతుల లేఖలు 

తుది తీర్పునకు లోబడి ఆర్‌-5 జోన్‌లో సెంటు భూముల పంపిణీ ఉండాలని ఇప్పటికే కోర్టులు తెలిపాయి. అయినప్పటికీ జులై 8 నుంచి నిర్మాణాలు ప్రారంభించేందుకే ఏపీ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పీఎంఓకు ఈ-మెయిల్‌, స్పీడ్‌ పోస్టులు, లేఖలు పంపాలని అమరావతి రైతు సమన్వయ కమిటీ గత ఆదివారమే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి సహా ఆ శాఖ కార్యదర్శులకు లేఖలు పంపిస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద నిధులు మంజూరు చేసేందుకు శాఖారమైన గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తమకు తెలిసిందన్నారు. రాజధాని రైతుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని అనుమతులపై మరోసారి ఆలోచించాలని లేఖల్లో వివరించారు.