AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( ఏపీ ఐసెట్- 2023) ఫలితాలను గురువారం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఏపీఎస్‌సీహెచ్ఈ అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఐసెట్- 2023ను మే 24న నిర్వహించారు. ఈ ఏడాది శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఐసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఏపీ ఐసెట్ కోసం 49,000 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 44,343 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాలి
1. ఏపీఎస్‌సీహెచ్ఈ అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in లోకి వెళ్లాలి. 2. హోమ్‌పేజీలో 'AP ICET 2023'పై క్లిక్ చేయండి. 3. ICET ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. 4. ఇప్పుడు, మీ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయండి. 5. మీ AP ICET 2023 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 6. భవిష్యత్తు అవసరాల కోసం హార్డ్‌కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.