AP Inter Hall tickets: ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.
మార్చి 1, 3వ తేదీల నుంచి ప్రారంభం కానున్న ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థులు కాలేజీ లాగిన్‌లతో పాటు వాట్సప్ గవర్నెన్స్‌లో భాగమైన 'మనమిత్ర' ద్వారా పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఇటీవల ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ ద్వారా అందించే సేవ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు 95523 00009 నంబర్ ద్వారా వాట్సప్‌లో హాల్‌టికెట్ పొందవచ్చు.
Details
వాట్సాప్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం
1. 95523 00009 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
2. 'Hi' అని వాట్సాప్ ద్వారా పంపండి.
3. అందిన లింక్‌లో 'సేవను ఎంచుకోండి' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. 'విద్యా సేవలు' సెలక్ట్ చేసి క్లిక్ చేయాలి.
5. 'ఇంటర్ ఫస్ట్ ఇయర్/సెకండ్ ఇయర్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్' ఆప్షన్ ఎంచుకోండి.
6. ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే టెన్త్ హాల్‌టికెట్/ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
7. సెకండ్ ఇయర్ విద్యార్థులైతే ఫస్ట్ ఇయర్ హాల్‌టికెట్ నంబర్/ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
8. కొద్ది నిమిషాల్లోనే హాల్‌టికెట్ మీ వాట్సాప్ నంబర్‌కు అందుతుంది. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.