LOADING...
Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ 
రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ

Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో భూరికార్డుల నిర్వహణను పటిష్టంగా చేసేందుకు, భూ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు 'నక్షా' అనే కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూరికార్డుల డిజిటలైజేషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,పట్టణ ప్రాంతాల్లో పారదర్శకతతో కూడిన సమర్థవంతమైన పాలనను అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా మొత్తం 152 మున్సిపాలిటీల్లో భూసర్వేను నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 10 మున్సిపాలిటీలు ఎంపిక చేశారు.

వివరాలు 

8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే ప్రక్రియ పూర్తి

ఈ 10 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 9.5 లక్షల ఆస్తులపై సర్వే చేయడం ద్వారా డిజిటలైజేషన్‌ను చేపడతారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి వివరించారు. 'నక్షా' ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, పట్టణ భూములపై ఏర్పడే వివాదాలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందన్నారు.