
Sri Kalahasthi : శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య.. విషాదంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలకలం రేగింది. ఈ మేరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పీఏ రవి(36) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబీకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద వ్యక్తిగత సహాయకులుగా(Personal Assistant)గా రవి పనిచేస్తున్నాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తరఫున వచ్చే వీఐపీలకు తిరుమలలో దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించేవాడు.
అయితే ఉన్నట్టుండి రవి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబం పుట్టెడు దుఖఃంలో మునిగిపోయింది.అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణాలుగా అనుమానిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అప్పుల బాధలే వల్లే రవి బలవన్మరణం అని అనుమానం
Crime News: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ రవి ఆత్మహత్య#Srikalahasti #MLAPA #suicide #TeluguNewshttps://t.co/arLFbhObRa
— Eenadu (@eenadulivenews) December 28, 2023