Anantapur: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, అతని భార్య అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కుటుంబ సమస్యల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి, ప్రస్తుతం అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహసీల్దార్‌గా సేవలు అందిస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం అతను అమూల్య అనే మహిళతో వివాహం చేసుకున్నాడు. వీరికి మూడున్నర ఏళ్ల సహర్ష అనే కుమారుడు ఉన్నాడు. రవి తన కుటుంబంతో అనంతపురంలోని శారదా నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
వివరాలు
కుటుంబ కలహాల కారణంగా అమూల్య ఆత్మహత్య
ఒక వైపు గురువారం ఉదయాన్నే రవి తన డ్యూటీకి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా ఉరేసుకుని అమూల్య కనిపించింది. మంచంపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం ఉంది. కాగా,కుటుంబ కలహాల కారణంగా అమూల్య ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. అమూల్య స్వయంగా ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.