LOADING...
AP: ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకుకు ఆప్కాబ్‌కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి 
ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకుకు ఆప్కాబ్‌కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి

AP: ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకుకు ఆప్కాబ్‌కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడంచెల సహకార వ్యవస్థలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకు (ఆప్కాబ్‌) జాతీయ స్థాయిలో రెండో స్థానం బహుమతిని సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని శిమ్లా వద్ద ఆదివారం జరిగిన జాతీయ సహకార సమావేశంలో ఈ బహుమతిని ఇఫ్‌కో ఛైర్మన్, ఎన్‌సీయూఐ అధ్యక్షుడు దిలీప్‌ సాంగానీ చేతుల మీదుగా ఆప్కాబ్‌ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అందుకున్నారు.

వివరాలు 

కేంద్ర సహకార బ్యాంకులను కోర్‌ బ్యాంకింగ్ విధానంలో ఏకీకృతం

ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ,"రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆప్కాబ్‌ వ్యాపారం కేవలం రూ.7,967 కోట్ల స్థాయిలో ఉంది.అయితే సాంకేతికతను సమర్థంగా వినియోగించుకొని 2025 నాటికి వ్యాపార లావాదేవీలు రూ.46,330 కోట్లకు చేరాయి. 13ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను కోర్‌ బ్యాంకింగ్ విధానంలో ఏకీకృతం చేసి 465బ్రాంచీలను ఒకే వేదికపైకి తేవడం సాధ్యమైంది. పీఏసీఎస్‌ కంప్యూటరైజేషన్‌లో 99.7%పూర్తి చేశాం.ఎరువుల దుకాణాలు,జన ఔషధి కేంద్రాలు, చౌక ధరల దుకాణాలను పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇప్పటికే 25 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి, మరికొన్ని 30 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది" అని వివరించారు. సమావేశంలో నాఫ్స్‌కాబ్‌ ఛైర్మన్ కె. రవీంద్రరావు, ఎండీ భీమ సుబ్రమణ్యం, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.