
మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరోసారి అలర్లు చెలరేగడం కలకలం సృష్టిస్తోంది.
గత కొద్ది రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు రోజురోజుకీ ముదురుతున్నాయి.
హింసాత్మకమైన ఘటనలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి.
కాంగ్‌పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో గురువారం అల్లర్లు జరిగాయి. వీటిని ఆపేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. గురువారం అతని మృతదేహాన్ని ఇంఫాల్ కు తరలించారు.
సమాచారం బయటకి పొక్కడంతో నివాళులు అర్పించేందుకు వచ్చిన జనం, మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబండ్ బజార్ కు తరలించారు.
details
అల్లర్లతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్ర మణిపూర్
అక్కడ కొందరు నిరసనకారులు సదరు శవపేటికను ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసానికి ఊరేగింపుగా మోసుకెళ్తామన్నారు.
అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి రోడ్ల మధ్యలో టైర్లను కాల్చడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ను ప్రయోగించింది.
పరిస్థితిని అదుపు చేసేందుకు మృత దేహాన్ని నెహ్రూ మెడికల్ కాలేజీలోని మార్చురీకి తరలించారు. మణిపూర్ ప్రభుత్వం ఇటీవలే మైతీలకు ఎస్టీ హోదా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కుకీ వర్గం తీవ్రంగా ఖండించింది.
ఈ నేపథ్యంలోనే మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు నేటికీ కొనసాగుతూన్నాయి. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో సుమారు 120 మందికిపైగా జనం మరణించగా, 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ఆశ్రయం కోల్పోయారు.