
UP: యూపీలో ఆర్మీ జవాన్ పై టోల్ ప్లాజా సిబ్బంది దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆర్మీ జవాన్‌పై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశ రక్షణ కోసం సేవలందిస్తున్న సైనికుడిని టోల్‌ప్లాజా సిబ్బంది అతి క్రూరంగా కొట్టిన ఘటన వెలుగుచూసింది. స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కపిల్ కవాద్ అనే సైనికుడు భారత సైన్యంలో రాజ్‌పుత్ రెజిమెంట్‌లో పనిచేస్తున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చి, తిరిగి విధుల్లో చేరేందుకు శ్రీనగర్ బయలుదేరుతున్నాడు. బంధువుతో కలిసి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తుండగా,ఆదివారం రాత్రి మీరట్-కర్నాల్ హైవేలోని భూని టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమయం తక్కువగా ఉందని,తాను ఆర్మీ జవాన్‌ని పేర్కొంటూ టోల్ సిబ్బందిని లైన్ క్లియర్ చేయమని కపిల్ అభ్యర్థించాడు.
వివరాలు
నలుగురు టోల్ ఉద్యోగులుఅదుపులోకి..
అయితే మాటామాటా పెరగడంతో వాగ్వాదం కాస్త ఘర్షణగా మారింది. వెంటనే టోల్ సిబ్బంది సమూహంగా జవాన్‌పై దాడి చేశారు. స్తంభానికి కట్టి కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వేగంగా పాకుతున్నాయి. సంఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. నలుగురు టోల్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోందని తెలిపారు. వీడియోలను సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీస్ సూపరింటెండెంట్ రాకేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. కపిల్ కవాద్ నిజంగా భారత సైన్యంలో పనిచేస్తున్నాడని, శ్రీనగర్‌లో విధుల్లో చేరేందుకు బయలుదేరిన విషయాన్ని ధృవీకరించారు.
వివరాలు
సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
తొందరలో టోల్ సిబ్బందిని వేడుకోవడం, ఆ తర్వాత వాగ్వాదం జరగడంతోనే ఘర్షణకు దారి తీసిందని వివరించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక మరో ముఖ్యాంశం ఏమిటంటే, కపిల్ కవాద్ గ్రామానికి టోల్ ఛార్జీల మినహాయింపు ఉంది. ఈ విషయాన్ని జవాన్ టోల్ సిబ్బందికి స్పష్టంగా తెలియజేసినా, వారు పట్టించుకోలేదు. అంగీకరించకపోవడంతో వాగ్వాదం మరింత ముదిరింది. దాంతో రెచ్చిపోయిన టోల్ ఉద్యోగులు కపిల్‌తో పాటు అతని బంధువుపైనా దారుణంగా దాడి చేశారు. చివరకు జవాన్‌ను స్తంభానికి కట్టి కర్రలతో చితకబాదారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు
🚨मेरठ : टोलकर्मियों ने सेना के जवान को बुरी तरह पीटा🚨
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 17, 2025
🆔 कश्मीर ज्वाइनिंग को जा रहा जवान जाम में फंसा था
🚧 टोल प्लाजा पर लंबे जाम को लेकर जवान ने किया विरोध
👊 विरोध करने पर टोल कर्मियों ने की जवान की पिटाई
💥 टोल प्लाजा पर सादे कपड़ों में रहता है गुंडों का जमावड़ा
🇮🇳 कोटका… pic.twitter.com/V6VEUcQcoG