LOADING...
Aravind Kejriwal-Thihar Jail-Insulin: అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ కొనసాగించండి..జైలు సిబ్బందిని కోరిన మెడికల్ 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్

Aravind Kejriwal-Thihar Jail-Insulin: అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ కొనసాగించండి..జైలు సిబ్బందిని కోరిన మెడికల్ 

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి(CM) అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ఇన్సూలిన్ (Insulin)మోతాదు కొనసాగించాలని కోర్టు (Court)ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తిహార్ జైలు సిబ్బందిని కోరింది. అరవింద్ కేజ్రీవాల్ కు జైలులో రెండుయూనిట్ల ఇన్సూలిన్ మోతాదును ఇస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు సూచించిన మందులలో మెడికల్ బోర్డు ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని మెడికల్ బోర్డు స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టు (Delhi Court) ఆదేశాల మేరకు ఎయిమ్స్‌లోని ఐదుగురు వైద్యుల బృందం శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. తీహార్ జైలుకు చెందిన ఇద్దరు వైద్యులు కూడా హాజరైన ఈ వీడియో కాన్ఫరెన్స్ అర్ధగంట పాటు కొనసాగింది.

Aravind Kejriwal-Insulin

కోర్టు ఆదేశాలమేరకు కేజ్రీవాల్​ కోసం మెడికల్​ బోర్డు ఏర్పాటు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిరోజూ తన వైద్యుడిని సంప్రదించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు గత వారం తిరస్కరించింది. టైప్ 2 డయాబెటిక్ అయిన కేజ్రీవాల్ కు ఇన్సులిన్ అవసరమా లేదా అనేది నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని తీహార్ జైలు అధికారులను గతవారం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇంటి ఆహారాన్ని కూడా కోర్టు జైలులో ఉన్నఅరవింద్​ కేజ్రీవాల్ కు అనుమతించింది. అయితే ఆ ఆహారం వైద్యులిచ్చిన డైట్ చార్ట్ కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. మెడికల్‌ బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ మామిడిపండ్లు, ఆలూ పూరీ, స్వీట్‌లు తింటున్నారంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపింగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.