Arvind Kejriwal: 4.5 కిలోలు తగ్గిన అరవింద్ కేజ్రీవాల్.. టెన్షన్ లో డాక్టర్లు
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేగంగా బరువు తగ్గుతున్నారు. బరువు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కానీ జైలు అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదంటున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి నాలుగున్నర కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. వేగంగా పడిపోతున్నబరువుపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా మారుతున్నట్లు జైలు డాక్టర్లు చెబుతున్నారు. ఓ దశలో 50కన్నా తక్కువ షుగర్ నమోదు అయినట్లు రిపోర్టులో ఉన్నది.బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు మెడిసిన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. లంచ్,డిన్నర్ కోసం ఆయనకు ఇంటి భోజనం పెడుతున్నారు.ఆయన కండీషన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కోసం ఆయన సెల్ వద్ద క్విక్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 15 వరకు జైలులోనే కేజ్రీవాల్
కేజ్రీవాల్ ఏప్రిల్ 15వరకు జైలులో ఉంటారు. జైలులో కేవలం ఆరుగురు మాత్రమే అతన్ని కలవగలరు. ఇందుకోసం కేజ్రీవాల్ ఆరుగురి పేర్లను సూచించారు. అతని భార్య సునీత,కొడుకు పుల్కిత్,కూతురు హర్షితతో పాటు ముగ్గురు స్నేహితుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీరిలో మొదటి పేరు సందీప్ పాఠక్,ఇది కాకుండా రెండవ పేరు విభవ్. ఇది కాకుండా మరో స్నేహితుడి పేరు మాత్రం వెల్లడించలేదు. తీహార్‌లో కేజ్రీవాల్ సమయం ఎలా గడుపుతున్నారు? తీహార్‌లో ఉన్న కేజ్రీవాల్‌కు మంగళవారం క్రిమినల్ కిట్ అందించారు.ఈ కిట్‌లో చెప్పులు, బెడ్‌షీట్‌లు కాకుండా అనేక ఇతర అవసరమైన వస్తువులు ఉన్నాయి. సోమవారం రాత్రి ఇంట్లో వండిన ఆహారం తిన్నారు.అదే సమయంలో మంగళవారం ఉదయం తీహార్ జైలులోనే అల్పాహారం తిన్నారు.యోగా కూడా చేశారు.