Arvind Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దిగువ రూస్ అవెన్యూ కోర్టులోరిమాండ్ ప్రొసీడింగ్స్‌తో క్లాష్ అవుతుందని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ ఎంఎం సుందరేష్,జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనుంది. అంతకుముందు రోజు, అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి తన అరెస్టుకు వ్యతిరేకంగా చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.