
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్షఅనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
మే 3న,జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తాత్కాలిక బెయిల్‌ను పరిగణించవచ్చని పేర్కొంది.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ,ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని,ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వీ అన్నారు.
దర్యాప్తు సంస్థ ముందు హాజరుకాకపోవడం అరెస్టుకు ఆధారం కాదు.ఎస్వీ రాజు అరెస్టు నిర్ణయం విచారణ అధికారులే కాకుండా ప్రత్యేక న్యాయమూర్తి కూడా తీసుకున్నారని అంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court to decide on the interim bail to Delhi CM #ArvindKejriwal today#moneylaundering #liquorscam #LokSabhaElections2024 https://t.co/vRmP912JBJ
— News9 (@News9Tweets) May 7, 2024