West Bengal: సందేశ్‌ఖాలీలో మళ్లీ హింస.. పోలీసులు, మహిళల మధ్య ఘర్షణ
సందేశ్‌ఖాలీలోని మహిళలకు మళ్లీ బెదిరింపులు వస్తున్నాయి. తమ భర్తలను చంపుతామని,తెల్లచీర కట్టుకుంటామని మహిళలను బెదిరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ బెదిరింపులకు వ్యతిరేకంగా సందేశ్‌ఖాలీలోని మహిళలు ఆదివారం సందేశ్‌ఖాలీ తదితర ప్రాంతాల్లో కర్రలు,చీపుర్లతో నిరసన తెలిపారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత ఇటువంటి హింసను నివారించేందుకు,ఎన్నికల తర్వాత కూడా కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల నాటి నుంచి సందేశ్‌ఖాలీలో మహిళలపై బెదిరింపులు కొనసాగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. మరోవైపు,బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించి,సందేశ్‌ఖాలీలో శాంతిని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్ సివి ఆనంద్ బోస్ అన్నారు.