Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ధరలకు కళ్లెం వేసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటను తక్షణమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎన్‌ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్‌ను ఆదేశించింది.
కొనుగులు చేసిన టమాట పంటను ఎక్కువగా వినియోగిస్తున్న కేంద్రాల్లో విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే రిటైల్ అవుట్‌లెట్‌లను గుర్తించినట్లు చెప్పింది. ఈ శుక్రవారం నాటికి దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోని వినియోగదారులకు రిటైల్ అవుట్‌లెట్‌ల తక్కువ ధరకే టమాట పంటను పంపిణీ చేయనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది.
టమాట
ఆగస్టులో టమాట పంట అదనపు దిగుమతి వచ్చే అవకాశం
టమాట దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి పండిస్తారు. అయితే మొత్తం ఉత్పత్తిలో దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల వాటా 56 శాతం నుంచి 58శాతం వరకు ఉంటుంది.
సాధారణంగా జులై-ఆగస్టు, అక్టోబరు-నవంబర్ మాసాల్లో టమాట ఉత్పత్తి తగ్గుతుంది.
ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల మార్కెట్‌లకు టమాట మహారాష్ట్రలోని సతారా, నారాయణంగావ్, నాసిక్ నుంచి సరఫరా అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె (చిత్తూరు)కి నుంచి కూడా టమమా తగిన పరిమాణంలోనే ఎగుమతి అవుతోంది.
దిల్లీకి హిమాచల్, కర్ణాటక నుంచి టమాట రవాణా అవుతుంది.
అయితే ఆగస్టులో టమాట పంట అదనపు దిగుమతి వచ్చే అవకాశం ఉందని, దీంతో కొరత తీరే అవకాశం ఉందని ఆహార మంత్రిత్వ శాఖ నొక్కిచెప్పింది.