Page Loader
Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక 
Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక

Election Commission: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక 

వ్రాసిన వారు Stalin
Mar 01, 2024
07:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024లోక్‌సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు మర్యాదను కొనసాగించాలని ఈసీఐ సూచించింది. ఒకవేళ.. ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్నిక ప్రవర్తనా నియమావళిని కింద చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పలు రాజకీయ పారీలు నాయకులు అసభ్యపదజాలం వాడిన నేపథ్యంలో ఎన్నికల ఇప్పుడు ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రచారం సమయంలో అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో వ్యవహరించాలని ఈసీ పేర్కొంది. ఈ సందర్భంగా గతంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన స్టార్ క్యాంపెయినర్లపై ఈసారి ఎనికల కమిషన్ ప్రత్యేకంగా నిఘా ఉంచనుంది.

ఈసీ

ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే

ఓటర్లను కులం/వర్గం ఆధారంగా ఓట్లను అడగొద్దని ఈసీ పేర్కొంది. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో రాజకీయ పార్టీలు, నాయకులు వాస్తవాధారం లేకుండా తప్పుడు ప్రకటనలు చేయకూడదని వెల్లడించింది. ప్రజా కార్యకలాపాలతో సంబంధం లేని ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితంలోని ఏ అంశాన్ని కూడా విమర్శించకూడదని ఈసీ తెలిపింది. ప్రత్యర్థులను అవమానించేలా, కించపరిచే వ్యక్తిగత విమర్శలు చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారానికి దేవాలయం/మసీదు/చర్చి/గురుద్వారా లేదా ఏదైనా ప్రార్థనా స్థలాన్ని ఉపయోగించకూడదని పేర్కొంది. భక్తుడు, దేవత మధ్య సంబంధాన్ని అపహాస్యం చేసేలా ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని చెప్పింది. అలాగే వార్తల రూపంలో ప్రకటనలు ఇవ్వొద్దని వెల్లడించింది.