Page Loader
Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ 
Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్

Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ 

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ (Ashok Chavan) మంగళవారం బీజేపీలో చేరనున్నారు. ముంబై బీజేపీ (BJP) కార్యాలయంలో దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన కాషాయ కండువను కప్పుకోనున్నారు. చవాన్ బీజేపీలో చేరేందుకే కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు అశోక్‌ చవాన్‌‌, అంతకుముందు బాబా సిద్ధిక్, మిలింద్ దేవరా వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ను వీడటంతో రాష్ట్రంలో హస్తం పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్‌ (Congress)ను వీడాలనేది తన వ్యక్తిగత నిర్ణయం అని చవాన్ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఇప్పటికే కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా