అస్సాంలో వరద భీభత్సం.. నీట మునిగిన 22 జిల్లాలు, 3 లక్షలకుపైగా నిరాశ్రయులు
అస్సాంలో మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. దాదాపుగా 22 జిల్లాలు నీట మునిగాయి. బ్రహ్మపుత్ర, ఉపనదులు పోటెత్తడంతో అస్సాం జలదిగ్బంధం అయ్యింది. ధుబ్రి, గోల్‌పర, గువాహటి, తేజ్‌పుర్, నెమటిఘాట్, దిసాంగ్, బురిదిహింగ్, సుబన్సిరి తదితర ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దాదాపు 3.40 లక్షల ప్రజలు ప్రభావితమైనట్లు అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గోల్‌పర, మోరిగావ్, బిశ్వనాథ్, శివసాగర్, లఖింపుర్ జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 153 సహాయక శిబిరాలను సిద్ధం చేసిన సర్కార్, పంపిణీ కేంద్రాల ద్వారా నిత్యావసరాలను అందిస్తున్నారు. ఒరంగ్ నేషనల్ పార్కులోని పులుల సంరక్షణ కేంద్రం సైతం నీటమునిగింది. వరదల ధాటికి 3 లక్షలపైనే అటవీ జంతువులు ప్రభావితమయ్యాయి.