Page Loader
Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన.. నడిరోడ్డుపై కత్తులతో దాడి

Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన.. నడిరోడ్డుపై కత్తులతో దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2024
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు కుతుబ్బుద్దీన్ అనే యువకుడి పై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానికులు మెహిదీపట్నం నాల నగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి