Page Loader
Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి 
ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి

Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2023
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ,మిజోరం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ముగియడంతో, ఇప్పుడు నవంబర్ 17న రాష్ట్రంలో రెండో దశ ఓటింగ్‌పై దృష్టి సారించింది. రాజస్థాన్,తెలంగాణలో వరుసగా నవంబర్ 23,30న ఎన్నికలు జరగనున్నాయి.మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు పూర్తిఅయ్యాయి. ఐదు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3 న ప్రకటించబడతాయి. ఇలాంటి సమయంలో చాలా మందికి తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం మరొక ఆందోళన కలిగించే అంశం. ఇక ఎన్ని‌కల్లో ఓటు వేసేందుకు వచ్చేవారు..ఓటరు స్లిప్పుతో ‌పాటు తప్పని‌స‌రిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అయితే..ఓటరు గుర్తింపు కార్డు లేనివారు కూడా తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Details

ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు పత్రాలు

ఒకవేళ మీ దగ్గర ఓటర్ కార్డు లేకపోతే ఎలక్టోరల్ రోల్‌లో మీ పేరు కోసం వెతకండి. అక్కడ మీపేరు కనిపించిన తర్వాత ఇతర గుర్తింపు పత్రాలు చూపించి తమ ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం కొన్ని రకాల కార్డులను గుర్తించింది. వీటిలో ఏదో ఒక కార్డు చూపించి మీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. అవి: డ్రైవింగ్ లైసెన్స్ పాస్ పోర్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఉపాధి హామీ జాబ్‌ కార్డు NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్ స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్

Details

ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చూసుకోవాలి? 

కేంద్ర, కేంద్ర ప్రభు‌త్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ‌చే‌సిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు పెన్షన్‌ డాక్యు‌మెంట్‌ విత్‌ ఫొటో హెల్త్‌ ఇన్సూ‌రెన్స్‌ స్మార్ట్‌ కార్డు ఫొటోలు కలి‌గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువ‌ప‌త్రాలు దివ్యాంగుల (విక‌లాంగులు) ధ్రువీ‌క‌రణ పత్రాలు MPలు/MLAలు/MLCలు మొదలైన వారికి జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు తో కూడా ఓటు వెయ్యవచ్చు. 1.https://voters.eci.gov.in/కి వెళ్లి, కుడివైపు ఎగువన ఉన్న'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి. 2. మీ రాష్ట్రాన్ని నమోదు చేసి,కావాల్సిన భాషను ఎంచుకోండి 3. అడిగిన వివరాలను నింపండి - పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ,లింగం 4. మీ జిల్లా,అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోండి 5. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సెర్చ్ పై క్లిక్ చేయండి