LOADING...
Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా
Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ హవా.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా

వ్రాసిన వారు Stalin
Dec 03, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కావల్సిన మేజక్ ఫిగర్‌తో దూసుకుపోతోంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్లు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ద్వారా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌‌లో ఉదయం 10:11గంటల వరకు వెలువడి ఫలితాలు ఇలా ఉన్నాయి. 230 స్థానాల్లో బీజేపీ 157 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. రాజస్థాన్‌‌లో బీజేపీ 100 మార్కును చేరుకుంది. 199 స్థానాల అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 112, కాంగ్రెస్ 72 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 23 స్థానాల్లో కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మధ్యప్రదేశ్ ఫలితాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్‌లో ఫలితాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఛత్తీస్‌గఢ్‌లో ఫలితాలు