Page Loader
CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..
యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..

CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాల సమయంలో కలిగే నష్టాలకంటే ఫలితం ఎంత ముఖ్యమో ఆయన స్పష్టం చేశారు. పోరాటంలో విజయం సాధించడమే ప్రధాన ఉద్దేశ్యమని వ్యాఖ్యానించారు. పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి కొద్దికాలం ముందు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేకంగా హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

ఇస్లామాబాద్  ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఆపేయాలని వార్నింగ్ 

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంటే తామేం చేయలేమన్న స్థితిలో పాకిస్తాన్ తలదించుకుందన్నారు. తాము తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని గ్రహించిన పాక్, సంప్రదింపుల కోసమే ముందడుగు వేసిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ ఇకనైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం లాంటి ముప్పు నుంచి భారత్ ఎప్పటికీ భయపడబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచదని ఆయన హెచ్చరించారు. అటువంటి అణు బెదిరింపులకు దేశం ఎప్పుడూ లొంగదని అన్నారు.

వివరాలు 

చిన్న నష్టాలు మన పోరాట సామర్థ్యాన్ని తగ్గించలేవు 

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఓ విధానంగా మార్చుకుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాల్పుల విరమణ విషయంలో ముందుగా పాక్‌దే ఆగ్రహం అయినా, నీరు రక్తంగా మారే పరిస్థితుల్లో అటువంటి ఒప్పందాలు వృథానేనన్నారు. పాకిస్తాన్ తన ధోరణిని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని చిన్నపాటి నష్టాలు జరిగినా, అవి భారత సాయుధ దళాల శక్తిపై పెద్దగా ప్రభావం చూపలేదని అనిల్ చౌహాన్ తేల్చిచెప్పారు. ఈ చిన్న నష్టాలు మన పోరాట సామర్థ్యాన్ని తగ్గించలేవని ఆయన అన్నారు.