Page Loader
అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి 
అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి

అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి 

వ్రాసిన వారు Stalin
Jun 15, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటుకున్న నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో గుజరాత్ తీరాన్ని ముంచెతుత్తోంది. ఈ క్రమంలో బిపోర్‌జాయ్ తుపాను ఉగ్రరూపాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగామి బంధించాడు. తుపాను తీవ్రతను కళ్లకు కట్టేలా ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. యూఏఈకు చెందిన వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాది అరేబియా సముద్రం మీదుగా దూసుకొస్తున్న తుపాను ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధించాడు. రెండు రోజుల క్రితం, అరేబియా సముద్రం మీదుగా భారత తీరం వైపు దిశను మార్చుకున్న తుపాను వీడియోను సోషల్ మీడియాలో నెయాది పంచుకున్నారు. ఈ ఛాయాచిత్రాలు వాతావరణ పర్యవేక్షణలో భాగంగా భూమిపై ఉన్న నిపుణులకు సహాయం చేస్తాయని నెయాది తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుల్తాన్ అల్ నెయాది పోస్టు చేసిన ఛాయాచిత్రాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తుపాను భారత్‌వైపు దూసుకొస్తున్నప్పుడు సుల్తాన్ తీసిన వీడియో