Loading...
AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని తెలిపారు. 62 శాతం జనాభా వ్యవసాయ సంబంధిత రంగాలపై ఆధారపడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం దృష్టిలో పెట్టుకోలేదని విమర్శించారు. భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ ఉద్దేశ్యంతో రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతను ఉపయోగిస్తామని అన్నారు. విత్తనాలు మరియు సూక్ష్మ పోషక ఎరువులను రాయితీపై అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

వివరాలు 

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులిలా.. 

అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు

రాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లు

భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు

విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు

ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు

పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు.

ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు

వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు

రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు

వివరాలు 

వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులిలా.. 

పంటల బీమా - రూ.1,023 కోట్లు

వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు

ఉద్యాన శాఖ - రూ. 3469.47 కోట్లు పట్టు

పరిశ్రమ - రూ.108.4429 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు

సహకార శాఖ -రూ.308.26కోట్లు

ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం -రూ.507.038 కోట్లు

ఉద్యాన విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు

శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు

మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు

పశుసంవర్ధక శాఖ -రూ.1,095.71 కోట్లు

మత్స్య రంగం అభివృద్ధి -రూ.521.34 కోట్లు

ఉచిత వ్యవసాయ విద్యుత్ -రూ.7241.30 కోట్లు

ఉపాధి హామీ అనుసంధానం -రూ.5,150కోట్లు

ఎన్టీఆర్ జలసిరి - రూ.50 కోట్లు

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు

ADVERTISEMENT