Page Loader
 అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 
అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్

 అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 

వ్రాసిన వారు Stalin
Apr 19, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. సస్పెండ్ అయిన ఎస్‌ఓను అశ్వనీ కుమార్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మంగళవారం పోలీసు సిబ్బంది అందరినీ విచారించిన తర్వాత సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతిక్ అహ్మద్ సోదరులను హత్య చేసిన ఎంఎల్‌ఎన్ మెడికల్ కాలేజీ షాగంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. హత్య జరిగిన సమయంలో షాగంజ్ పోలీస్ స్టేషన్‌‌లో ఆ ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు.

యూపీ

పోలీస్ కస్డడీలో అతిక్ అహ్మద్ హంతకులు

ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అతిక్ అహ్మద్, అష్రఫ్‌ను ఏప్రిల్ 16న ప్రయాగ్‌రాజ్‌లో ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపారు. జర్నలిస్టుల ముసుగులో వచ్చి పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో అతిక్ అహ్మద్ సోదరులను ఆ ముగ్గురు హత్య చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సీజేఎం కోర్టు బుధవారం గ్యాంగ్‌స్టర్ అతిక్ హంతకులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ చేసింది. ముగ్గురు నిందితులను విచారించేందుకు రిమాండ్‌ను కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టును పిటిషన్ దాఖలు చేయడంతో ఏప్రిల్ 16న జిల్లా కోర్టు వారిని 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. గ్యాంగ్‌స్టర్ల హత్యకు గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏప్రిల్ 23న ముగ్గురు నిందితులను మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు.