Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆదివారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతా అందరూ మద్దతు ప్రకటించారు. దిల్లీలో ప్రతిపక్ష నేతగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి.
Details
ఆప్ శాసనసభాపక్ష భేటీలో కీలక నిర్ణయం
ఆప్ శాసనసభాపక్ష భేటీకి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ఇటీవల ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆతిశీ, తనను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీలో ప్రజల తరఫున బలమైన స్వరం వినిపిస్తామని, బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తామని ఆమె అన్నారు.
బీజేపీ పాలనలో కొత్త అధ్యాయం
ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి, ఆప్ పాలనకు ముగింపు పలికింది. రేఖా గుప్తా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నెల 24 నుంచి దిల్లీ అసెంబ్లీ తొలి సెషన్ ప్రారంభంకానుంది.
Details
కాగ్ నివేదికలపై చర్చ
మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై పెండింగ్‌లో ఉన్న కాగ్ నివేదికలను ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సమావేశాలు దిల్లీ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానున్నాయి.