Bihar: దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం
బిహార్‌లోని సహర్షా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులపై స్పందించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఈ దారుణ ఘటనపై బాలిక సోమవారం సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ హిమాన్షు చెప్పారు. బాధితురాలను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని, ఇంకా నివేదిక ఇంకా రాలేదన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక నిందితుడిని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు నిందితులు ఉపయోగించిన కారును సీజ్ చేశామన్నారు.