Page Loader
Brutal murder: హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

Brutal murder: హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని శృతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె కుటుంబసభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. శృతి రేప్ అండ్ మర్డర్ కి గురై, ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరు అమ్మాయిలు తమ ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్ తో కలిసి హోటల్‌లో రెండు గదులు బుక్ చేశారు. సోమవారం ఉదయం ఒక గదిలో శృతి మరణించింది. పోలీసులు ఘటన స్థలంలో విచారణ నిర్వహించగా, గదిలో మద్యం సీసాలు లభించినట్లు తెలిపారు.

Details

కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు

శృతి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో, ఆమె కుటుంబసభ్యులు హోటల్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలిపై లైంగికదాడి చేసి హత్య చేశారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.