Page Loader
Sexual Assault: యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి 
యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి

Sexual Assault: యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2023
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ అధికారి కూతురిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో 22 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కథనం మేరకు ఆమె కొంతకాలంగా కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శటీ ఆస్పత్రిలో సైకియాట్రీ డిపార్ట్ మెంట్‌లో చికిత్స పొందుతోంది. బాధితురాలు తరుచుగా టీ వ్యాపారి సత్యం మిశ్రా దగ్గరికి తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టడానికి వెళ్లేది. అయితే సత్యం మిశ్రా, బాధితురాలని ఫోన్ ఛార్జింగ్ కోసం సమీపంలోని అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లాడు.

Details

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

తర్వాత సత్యం మిశ్రా మహిళను కారులో బారాబంకిలోని సఫేదాబాద్ ప్రాంతంలోని ఒక దాబాకు తీసుకెళ్లాడు. అందులో ఇద్దరు వ్యక్తులు ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించారు. ఇందిరా నగర్ ప్రాంతంలో దించడానికి ముందు కారులో ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక్ దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై 376 (డి), 342, 328, 323 సెక్లన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక నిందితుల నుంచి కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.19,830 స్వాధీనం చేసుకున్నారు.