Page Loader
ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు
దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు

ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 16, 2023
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వితంతు మహిళ తీవ్ర ఆకృత్యానికి గురైంది. 12.30 గంటల సమయంలో ఆమె కళ్లలో కారం కొట్టి వివస్త్రను చేశారు. అంతటితో ఆగకుండా సజీవ దహనానికి ఒడిగట్టారు. ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. ఈ క్రమంలో నర్సు శిక్షణ తీసుకున్న సదరు బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు, బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. గత మార్చిలో ఆ ప్రేమజంట బయటకువెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.

details

కుళాయి వద్దకు నీటి కోసం వెళ్తే వివస్త్రను చేసిన బ్రహ్మారెడ్డి దంపతులు 

ఈ నేపథ్యంలోనే ఆమె సోదరుడి ఇంటిపై దాడికి దిగిన యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ అతని తల్లిని, సోదరిని కులం పేరుతో తీవ్రంగా దూషించారు. తమ కుమార్తెను అప్పగించకుంటే హతమారుస్తామని బెదిరింపులకు గురిచేశారు. దీంతో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత వితంతురాలు సోమవారం తన తల్లిని చూసేందుకు పుట్టింటికి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో కుళాయి వద్ద మంచి నీరు వస్తోందని వీధిలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే నిందితులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మలు ఆమెను బలవంతంగా పట్టుకుని కళ్లలో కారం కొట్టారు. విచక్షణ రహితంగా కత్తులతో పొడిచారు.

details

నిందితులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు

అనంతరం వీధుల్లోకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి మరోసారి దాడి చేశారు. అక్కడితో ఆగకుండా పెట్రోలు చల్లి నిప్పు అంటించే దుశ్చర్యకు ఒడిగట్టారు. దీంతో మానవత్వంతో స్పందించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన తరలివచ్చిన పోలీసులు నిందితుడు బ్రహ్మారెడ్డి ఇంట్లో సోదాలు చేయగా, బాధితురాలు బందీగా కనిపించింది. దీంతో ఆమెను విడిపించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితులపై అపహరణ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరినీ మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.