Ayodhya Ram Temple : అయోధ్య లో భారీ వర్షం..రామ మందిరం పై కప్పు నుండి నీరు లీక్
ఉత్తర్‌ప్రదేశ్,అయోధ్యలోని రామాలయంలోగర్భగుడి పైకప్పు నుండి నీరు లీక్ అయిందని దాని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. భారీ వర్షం తర్వాత ఇలా జరగడం భక్తుల్లో ఆందోళ కలిగిస్తుంది. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పూజారి ఆరోపించారు. శనివారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత ఆలయ ప్రాంగణం నుండి వర్షపు నీరు వెళ్లే ఏర్పాటు కూడా లేదని, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ప్రధాన పూజారి కోరారు.
ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా సందర్శన
ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పైకప్పును చూశారు. మరమ్మతులు చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చాలని ఆదేశాలు ఇచ్చారని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.ఆలయ నిర్మాణ పురోగతి గురించి మిశ్రా విలేకరులతో విడివిడిగా మాట్లాడారు. మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని, డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆచార్య సత్యేంద్ర దాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆలయ గర్భగుడి పైకప్పు నుండి భారీ లీకేజీ ఏర్పడింది. రామ్ లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం , విఐపి దర్శనం కోసం ప్రజలు వచ్చే ప్రదేశం నుండి నేరుగా పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోంది.
రంగంలోకి దిగిన అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి
జల్వాన్‌పురా నుంచి హనుమాన్‌గర్హి భక్తిపథ్ వరకు, తేది బజార్ నుంచి లోపలి ప్రాంతాల వరకు నీటి ముంపు ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. వర్షం సమయంలో రాంపథ్‌లోని సందుల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరడంపై అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి స్పందించారు. ఉదయం నుండి నష్ట నియంత్రణ చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇళ్ల నుండి నీటిని తొలగించడానికి మున్సిపాలిటీకి చెందిన అనేక బృందాలను నియమించామన్నారు .అయితే, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) ఉన్నతాధికారుల స్పందన కోరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
నిర్మాణంలో అవినీతి కాంగ్రెస్ ఆరోపణ
ఇదిలా ఉండగా, ఆలయ నిర్మాణంలో, దేవాలయ పట్టణంలో పౌర సదుపాయాల కల్పనలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. అది అమరవీరుల శవపేటిక కావచ్చు లేదా దేవుడి గుడి కావచ్చు, ఇవన్నీ బిజెపికి అవినీతికి అవకాశాలుగా మారాయి. దేశంలో విశ్వాసం , స్వచ్ఛత యొక్క చిహ్నాలు కూడా వారికి దోచుకునే అవకాశాలు మాత్రమే" అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు. సోమవారం ఒక ప్రకటనలోతీవ్రంగా దుయ్యబట్టారు