LOADING...
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!
ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ పథకంపై దెబ్బ.. ఆసుపత్రులకు రూ.1.2 లక్షల కోట్లు బకాయిలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో అతిపెద్ద ఆరోగ్య పథకం 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY)' సమస్యల్లో చిక్కుకుంది. అయితే హర్యానాలో మాత్రం పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ఆగస్టు 7 నుంచి 600కి పైగా ప్రైవేట్‌ హాస్పిటల్స్ ఈ పథకం కింద చికిత్సలు నిలిపివేశాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.500 కోట్ల వరకు నిలిచిపోయాయి. హర్యానా ఆయుష్మాన్ సమితి అధ్యక్షుడు డాక్టర్ సురేష్ అరోరా మాట్లాడుతూ, ప్రైవేట్‌ ఆసుపత్రులు-ప్రభుత్వం మధ్య విశ్వాసం పూర్తిగా కోల్పోయిందని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆసుపత్రులు 'చెల్లింపులు రావడం లేదు, ప్యాకేజీలు తక్కువ' అని ఆరోపిస్తుంటే, అధికారులు మాత్రం 'అతిగా బిల్లులు పెడుతున్నారు' అని అంటున్నారు.

Details

నలిగిపోతున్న రోగులు

ఫరూకాబాద్‌కి చెందిన జమీల్‌ అనే రోగి క్యాన్సర్ చికిత్సకు చేరగా, గతేడాది నుంచే రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ ద్వారా లబ్ధి పొందాడు. కానీ ఆస్పత్రులకు కోట్ల రూపాయిల బిల్లులు పెండింగ్‌లో నిలిచిపోయాయి. మరోవైపు ధర్మవీర్‌ అనే కూలీ ఫ్రాక్చర్‌ చికిత్సకు వెళ్ళగా, కార్డ్ పనికిరాలేదు. సాధారణ రోగిలా ఫీజు చెల్లించాల్సి వచ్చింది. చెల్లింపులపై వివాదం ప్యాకేజీ రేట్లు 2021 నుండి పెరగలేదని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి సమర్పించిన బిల్లులపై 50-90 శాతం వరకు డిడక్షన్లు చేస్తున్నారని ఆస్పత్రులు అంటున్నాయి. అయితే అధికారులు మాత్రం 'సరైన డాక్యుమెంట్లు ఇవ్వడంలేదు, కొన్నిసార్లు ఫేక్ బిల్లులు పెడుతున్నారని వాదిస్తున్నారు.

Details

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

మణిపూర్‌లో 43 ప్రయివేటు ఆస్పత్రులకు రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, దిల్లీ, త్రిపుర, నాగాలాండ్‌లలో కూడా పరిస్థితి ఒకేలా ఉందని వైద్యులు చెబుతున్నారు. గతేడాది చత్తీస్‌గఢ్‌లో 33 ఆసుపత్రులపై నకిలీ క్లెయిమ్‌ల కారణంగా భారీ జరిమానాలు విధించారు. ఇబ్బందులు పడుతున్న రోగులు సోనిపట్ జిల్లాకు చెందిన కమల్ గుప్తా తండ్రి అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రులు తిరస్కరించగా, చివరికి ప్రభుత్వ దవాఖానకు వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడా రోగుల రద్దీ అధికమై శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వ హామీ హర్యానా ఆరోగ్య మంత్రి రణ్‌బీర్ సింగ్ గంగ్వా మాట్లాడుతూ, హాస్పిటల్స్ ఆందోళన అవసరం లేదు. బకాయిలను త్వరలో చెల్లిస్తాం. వైద్యులు రోగులను తిరస్కరించవద్దని విజ్ఞప్తి చేశారు.