
Pinaka-IV: చైనా,పాకిస్తాన్‌లకు బ్యాడ్ న్యూస్.. ఎయిర్ డిఫెన్స్‌కు ఛేదించే క్షిపణి తయారు చేస్తున్న భారత్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు కావడంతో, భారత్ తన రక్షణ శక్తిని అంతర్జాతీయంగా చూపించింది. స్వదేశీ ఆయుధ శక్తిని వినియోగించిన భారత్, పాకిస్థాన్ డ్రోన్లు, చైనా తయారీ మిస్సైళ్లను ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో సమర్థంగా తిప్పికొట్టింది. అలాగే, స్కై స్ట్రైకర్ డ్రోన్ల సహాయంతో పాకిస్తాన్ చేపట్టిన దాడులను సమర్ధవంతంగా అడ్డగించగలిగింది. భారత్ ఇచ్చిన ఈ మాసివ్ కౌంటర్ దెబ్బను పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనా కూడా జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నాయి.
వివరాలు
శత్రు దేశాలపై మరో ఎదురు దెబ్బ - పినాకా-4 అభివృద్ధి
ఇదే తరుణంలో, భారత్ ఈ రెండు శత్రు దేశాలకు మరో షాక్ ఇచ్చేలా ముందడుగులు వేసింది. శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని తప్పించుకుంటూ లక్ష్యాలను ఛేదించగల క్షిపణి వ్యవస్థను భారత్ అభివృద్ధి చేస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందిస్తున్న ఈ కొత్త తరం గైడెడ్ రాకెట్ వ్యవస్థ పేరు పినాకా-4. ఇది సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై అత్యంత ఖచ్చితంగా దాడి చేసే సామర్థ్యంతో అభివృద్ధి చేస్తున్నారు.
వివరాలు
2028లో మొదలయ్యే పరీక్షలు - వ్యూహాత్మక లక్ష్యాలతో అభివృద్ధి
ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ (IDRW)సమాచారం ప్రకారం,పినాకా-4 సంబంధిత ఫస్ట్ ట్రయల్స్ 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రళయ్ తరహా వ్యూహాత్మక క్షిపణుల ప్రేరణతో రూపుదిద్దుకుంటున్న ఈ వ్యవస్థలో, శత్రుదేశాల రక్షణ వ్యవస్థల్ని తప్పించుకునే నైపుణ్యంతో పాటు,అత్యున్నత స్థాయిలో లక్ష్యాలను ఛేదించే అధునాతన సాంకేతికతను జోడిస్తున్నారు. భారత ఆర్టిలరీలో కీలక భాగం పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధం అనంతరం,భారత సైన్యం ఈ రాకెట్ వ్యవస్థ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. పినాకా అనే మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను తొలి విడతగా అభివృద్ధి చేసి,భారత సైన్యంలో సమర్థంగా వినియోగిస్తున్నారు. అప్పటి నుంచీ పినాకా వ్యవస్థ భారత ఆర్టిలరీలో కీలకంగా నిలిచింది.పురాణాల్లో శివుని విల్లుగా పేర్కొన్న'పినాకా'పేరునే ఈ శక్తివంతమైన ఆయుధ వ్యవస్థకు పెట్టారు.
వివరాలు
పరిణతి దశలో ఉన్న పినాకా వెర్షన్లు
పినాకా Mk-I మొదటి వెర్షన్ 40 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. అనంతరం పరిధి పెరిగేలా కొత్త వెర్షన్‌లు అభివృద్ధి చేశారు. Mk-II వెర్షన్ 75 నుంచి 90 కిలోమీటర్ల దూరం దాకా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉండగా, Mk-III వెర్షన్ దాదాపు 120 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఇప్పుడు అభివృద్ధిలో ఉన్న పినాకా Mk-IV వ్యవస్థ, 250 కిలోల బరువు గల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది శత్రువులపై మరింత తీవ్రంగా దాడి చేయగల అధిక శక్తివంతమైన క్షిపణిగా రూపుదిద్దుకుంటోంది.