
Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మద్యం ధరలు ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మిగిలిన మద్యంపైనా కూడా ధరలు పెంచడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా, ఎక్సైజ్ శాఖ మద్యంపై విధించే సెస్‌ను పునర్‌సమీక్షించింది.
ముఖ్యంగా స్పెషల్ ఎక్సైజ్ సెస్ (SES) మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది.
ఇప్పటికే 2020లో తెచ్చిన ఈ సెస్‌ను 2023లో తొలగించిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని పునరుద్ధరించింది.
తాజా నిర్ణయంతో, కొన్ని రకాల మద్యం బాటిళ్లపై ఈ సెస్‌ను పెంచడం విశేషం. అయితే, బీర్, చీప్ లిక్కర్, రెడీ టూ డ్రింక్ పానీయాలపై మాత్రం ఈ మార్పులు వర్తించవని స్పష్టంచేసింది.
వాటిపై ప్రస్తుతం ఉన్న పన్నులు యథావిధిగా కొనసాగుతాయి.
Details
ఏ మేరకు పెరిగాయాలంటే
ఈ మార్పుల్ని అమలులోకి తేవడానికి దుకాణాల యాజమాన్యాలకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా సర్క్యులర్‌లు పంపింది. అందులో పేర్కొనబడిన విధంగా:
180ml (క్వార్టర్) బాటిల్‌పై రూ.10 పెంపు
ఆఫ్ బాటిల్ (375ml)పై రూ.20 పెంపు
ఫుల్ బాటిల్ (750ml)పై రూ.40 పెంపు
ఈ తాజా పెంపుతో మద్యం వినియోగదారుల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే బీర్ల ధరల పెంపుతో నష్టపోయిన మందుబాబులకు ఇది మరో భారంగా మారింది.
ప్రభుత్వ నిర్ణయంపై సామాన్యులు, మద్యం వ్యాపారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.