Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన 'కుంభమేళా' కు వెళ్లాలని భావించిన భక్తులకు రైల్వే బోర్డు భారీ షాక్ ఇచ్చింది.
సికింద్రాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్, కాశీ నగరాల మీదుగా బీహార్‌కు వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు, మొత్తం తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.
ఈ రద్దుతో భక్తుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. బుధవారం బయల్దేరాల్సిన దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రే రైల్వే బోర్డు ప్రకటించింది.
ఇప్పుడు ఏకంగా నెలాఖరు వరకు ఈ రైలును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
Details
నిరాశలో భక్తులు
ఇటార్సి-ప్రయాగ్‌రాజ్ మార్గంలో నిత్యం వందల రైళ్లు నడుస్తున్నా సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఏకైక రెగ్యులర్ రైలును రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది.
ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగియనుండటంతో రైల్వే నిర్ణయం భక్తులను తీవ్రంగా నిరాశపరిచింది.
రోడ్డు, వాయు మార్గాల్లో ప్రయాణించే వీలు లేకపోవడంతో 36,000 మందికి పైగా ప్రయాణికులు ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నా రైలు రద్దుతో భక్తులు నిరాశచెందారు.
Details
ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లు, కానీ
సికింద్రాబాద్-దానాపూర్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసిన రైల్వే బోర్డు, ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు చర్లపల్లి-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
అయితే ఈ రైళ్లు నల్గొండ, విజయవాడ, భువనేశ్వర్, పట్నా మీదుగా దానాపూర్‌కు వెళతాయి
కానీ, ప్రయాగ్‌రాజ్, కాశీ నగరాలను కవర్ చేయవు. దీంతో భక్తులకు ప్రయాణం మరింత సంక్లిష్టంగా మారింది.