LOADING...
Balasore campus horror: విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా బిజెడి నిరసన.. టియర్ గ్యాస్,వాటర్ ఫిరంగి ప్రయోగించిన ఒడిశా పోలీసులు 

Balasore campus horror: విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా బిజెడి నిరసన.. టియర్ గ్యాస్,వాటర్ ఫిరంగి ప్రయోగించిన ఒడిశా పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలో 20ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. కాలేజీ లెక్చరర్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిరసనలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేడీ కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. ముఖ్యంగా భువనేశ్వర్‌లో అసెంబ్లీ సమీపంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లను ప్రయోగించారు. ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్రంగా నినాదాలు చేశారు.

వివరాలు 

బంద్ కారణంగా నిలిచిపోయిన జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు

బంద్ కారణంగా బాలాసోర్ సమీపంలోని కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలకు చెందిన 20ఏళ్ల విద్యార్థిని కాలేజీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తనపై హెచ్‌వోడీ లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్, కళాశాల అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కళాశాల క్యాంపస్‌లోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం తీవ్ర గాయాలపాలై జూలై 14న ఎయిమ్స్ భువనేశ్వర్‌లో చికిత్స పొందుతూ 95 శాతం కాలిన గాయాలతో మృతి చెందింది.

వివరాలు 

 కాలేజ్ ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ అరెస్ట్ 

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కేసులో కాలేజ్ ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థిని మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నేరాన్ని పూర్తిగా విచారించి సంబంధిత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ మద్దతుతో వైద్య బృందం ఎంతో కృషిచేసినా విద్యార్థినిని కాపాడలేకపోయిన విషయం బాధాకరమన్నారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అధికారులకు తగిన సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టియర్ గ్యాస్,వాటర్ ఫిరంగి ప్రయోగించిన ఒడిశా పోలీసులు