తదుపరి వార్తా కథనం

R Krishnaiah: కేంద్ర నిర్లక్ష్యానికి ప్రతీకగా ఈనెల 14న తెలంగాణలో బంద్ : ఎంపీ ఆర్.కృష్ణయ్య
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 11, 2025
05:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు ఎంపీ 'ఆర్.కృష్ణయ్య' వెల్లడించారు. బంద్‌కి అన్ని బీసీ సంఘాల మద్దతు ఉండనుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు కూడా బంద్‌కు మద్దతివ్వాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. అలాగే, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలసి బంద్‌కు బీజేపీ మద్దతు కోరామని, పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.