
Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా పాలిటిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ కొత్త స్ట్రాటేజీతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ముందే బీసీ సీఎం అని ప్రకటించాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ ప్లాన్ ప్రకారం.. సీఎం రేసులో ఈటెల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్ ఉన్నారు.
ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో ముందుంటున్నారు.
బీజేపీ అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
Details
చత్తీస్‌ఘడ్ స్టార్ క్యాంపెనర్ గా బండి సంజయ్
బండి సంజయ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.
బీజేపీ ఆదిష్టానం ఆయనకు చత్తీస్‌ఘడ్ స్టార్ క్యాంపెనర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా నిలబడతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ, చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బండి అటు స్టార్ క్యాంపనర్ గా ఇటు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఆసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు చత్తీస్‌ఘడ్ ఎన్నికలు ప్రచారం చేస్తూనే, ఇటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించుకొనే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ అదిష్టానం అదేశిస్తే కరీంగనర్ నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించాడు.