గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి. బెంగళూరు సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే జలమయమైంది. హైవే అండర్‌బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లడం జరుగుతోంది. అలాగే ఒక వాహనాన్ని మరో వాహనం ఢీ కొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా హైవేపై సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. గతేడాది కూడా కర్నాటకలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనప్పుడు కూడా అండర్‌బ్రిడ్జి ఇదే విధమైన వరదలకు గురైంది.
సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రధాని మోదీపై వాహనదారుల ఆగ్రహం
హైవే అండర్‌బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో తమ వాహనాలు అందులో మునిగిపోయి మరమ్మతులకు గురైనట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాహనాలను డ్యామేజ్ కావడానికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఈ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించడానికి ముందు ఒకసారైనా తనిఖీ చేశారా? ప్రశ్నించారు. తన మారుతీ స్విఫ్ట్ కారు నీటిలో మునిగిపోయిందని, ఈ క్రమంలో ఆగిన కారును లారీ వచ్చి ఢీకొట్టిందిన ఓ బాధితుడు ఎన్డీటీవీకి గోడును చెప్పుకున్నాడు. అదే ఇక్కడి ప్రధాని వస్తారని తెలియగానే ఈ నీటిని పది నిమిషాల్లో ఖాళీ చేయిస్తారని, సామాన్యుల కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని మరో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.